- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తిన్న అన్నం అరగడం లేదా.. ఇలా చేయండి!
by Jakkula Samataha |
X
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య అజీర్ణం, గ్యాస్ , అసిడిటీ. ఈ సమస్యలు యూత్‌ను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ప్రతి ఒక్కరూ అన్నం తింటుంటారు. అయితే కొందరికి ఇది సులువుగా జీర్ణం అయితే, మరికొందరికి అస్సలే జీర్ణం కాదు, ఇంకొందరికి తిన్న ఐదు లేదా ఆరు గంటల తర్వాత జీర్ణం అవుతుంది.
ఇక అన్నం తిన్నప్పుడు అది సరైన సమయానికి జీర్ణం అవుతే ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ తిన్నది సరిగ్గా అరగకపోతే, కడుపు నొప్పి, మలబద్ధకం, అజీర్తి, ఆకలి మందగించడం లాంటి చాలా సమస్యలు తలెత్తుతాయి. అందువలన తిన్న అన్నం త్వరగా జీర్ణం కావాలంటే కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- మనం తిన్న ఫుడ్ డైజెషన్ కానట్లు అనిపిస్తే సోంపును ఒక స్పూన్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఇది త్వరగా తీసుకున్న ఆహారాన్ని జీర్ణం అయ్యేలా చేస్తుంది.
- అసిడిటీ సమస్య బాధిస్తుంటే, చిన్న బెల్లం ముక్కను భోజనం చేసిన తర్వాత ప్రతి సారి, నోట్లో వేసుకుని చప్పరిస్తే త్వరగా జీర్ణం అవుతుంది.
- జీర్ణ సమస్యలు ఉన్నవారు, పరగడుపున ఒకటి రెండు టీ స్పూన్లు అల్లం రసం తీసుకుంటే మంచిది. ఇలా తీసుకోవడం వలన ,అజీర్ణంతో పాటు కడుపులో వికారం కూడా తగ్గిపోతుందంటున్నారు వైద్యులు.
- తిన్న తర్వాత వాటర్ ఎక్కువగా తీసుకోవాలంట. కొంత మంది తిన్న గంట తర్వాత వాటర్ తాగుతారు అలా కాకుండా తిన్న రెండు మూడు నిమిషాల తర్వాత మంచినీళ్లు తాగితే తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుందంట.
- పెరుగు అసిడిటీ, అజీర్ణ సమస్యలకు దివ్య ఔషదం. తిన్న అన్నం డైజెషన్ కావాలంటే, మజ్జిగ లేదా పెరుగు తీసుకోవడం చాలా మంచిదంట.
Advertisement
Next Story