constipation : మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా? ఈ టిప్స్ మీ కోసమే!

by Jakkula Samataha |
constipation : మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా? ఈ టిప్స్ మీ కోసమే!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో మలబద్ధకం ఒకటి. మనం తీసుకుంటున్న ఆహారం జీవన శైలి కారణంగా చాలా మంది ఇలాంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారు. మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వలన ఇలాంటి సమస్య ఏర్పడుతుంది. కొంత మంది ఈ మలబద్ధకం సమస్యను చాలా లైట్ తీసుకుంటారు. కానీ దీని వలన అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇలాగే కొనసాగితే, గ్యాస్, ఉబ్బరం, వంటి సమస్యలు వస్తాయి. అయితే అసలు మలబద్ధకం సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి అనే విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో, ఇప్పుడు తెలుసుకుందాం.

బొప్పాయి : బొప్పాయి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మనం తీసుకున్న ఆహారాన్ని ఈజీగా జీర్ణం చేస్తుంది. అందు వలన ప్రతి రోజూ బొప్పాయి తీసుకోవడం వలన మలబద్ధకం సమస్య తగ్గుతుంది.

యాపిల్ : యాపిల్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిని కూడా మనం మన డైట్‌లో చేర్చుకోవడం వలన మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే యాపిల్ తిన్నప్పుడు కొందరు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. తొక్క తీసేసి యాపిల్ తింటారు. కానీ అలా కాకుండా తొక్కతోనే యాపిల్ తినాలంట.

కివి : కివిలో ఫైబర్, నీరు , ఆక్టినిడిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మనం తీసుకున్న తర్వాత జీర్ణక్రియను మెరుగు పరిచి, కడుపును శుభ్రం చేస్తుంది. అందువలన దీనిని కూడా మనం ప్రతి రోజూ తినడం వలన మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు.

ఆరెంజ్ : మలబద్ధకానికి బెస్ట్ ఫ్రూట్స్ ఏవైనా ఉన్నాయా అంటే అవి ఆరెంజెస్‌నే. ఇందులో జీర్ణక్రియను మెరుగుపరిచే ఎంజైమ్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువలన దీనిని తీసుకోవడ వలన మలబద్ధకం సమస్య నుంచి ఈజీగా ఉపశమనం పొందుతారు.

( నోట్ : పై సమాచారం నిపుణులు, ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు.)

Next Story

Most Viewed