రాగులతో చేసిన పదార్థాలు తింటున్నారా.. ఈ సమస్యలున్నవారు జాగ్రత్త ముప్పు తప్పదంటున్న నిపుణులు!

by Hamsa |
రాగులతో చేసిన పదార్థాలు  తింటున్నారా.. ఈ సమస్యలున్నవారు జాగ్రత్త ముప్పు తప్పదంటున్న నిపుణులు!
X

దిశ, ఫీచర్స్: సమ్మర్ పూర్తిగా రాకముందే ఎండలు భగ్గుమంటున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ ఏడాది మార్చిలోనే భానుడి భగభగలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉక్కపోతతో పాటు వడదెబ్బతో బాధపడుతున్నారు. ఈ ఎండ కారణంగా ప్రజలు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోవడం కూడా సంభవిస్తుంది. ముఖ్యంగా ఊబకాయం, హైబీపీ, డీహైడ్రేషన్, వంటి సమస్యలు ఉన్నవారికి ఈ ఎండ వల్ల ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.

ఈ క్రమంలో చాలామంది శరీరాన్ని చల్లపరుచుకునేందుకు పలు పానీయాలను సేవిస్తుంటారు. ముఖ్యంగా చాలా మంది రాగి జావ ఆరోగ్యానికి మంచిదని ప్రాధాన్యతను ఇస్తుంటారు. అయితే రాగి జావ లోని పోషకాలు ఆరోగ్యానికి ప్రయోజనాలను కలిగిస్తాయని అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ప్రోటీన్స్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, పుష్కలంగా ఉండి మంచి ఫలితాలను అందిస్తాయి. అయితే రాగులతో చేసిన పదార్థాల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు తీసుకోవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

*మూత్రపిండాల్లో రాళ్ల తో బాధపడేవారు రాగులను తినకూడదు. ఇది శరీరంలో ఆక్సాలిక్ యాసిడ్‌ను పెంచి సమస్యను తీవ్రతరం చేస్తుంది.

* అలాగే థైరాయిడ్ వ్యాధితో బాధపడేవారు రాగులతో చేసినవి తినడం హానికరం. రాగులు థైరాయిడ్ గ్రంథి పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి.

* జీర్ణశయ సమస్యలు ఉన్నవారు, వాపు, అజీర్తి, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు ఉన్నవారు రాగులకు దూరంగా ఉండటం మంచిది.

* రాగులను అధికంగా తీసుకోవడం వల్ల డయేరియా, గ్యాస్ వంటివి వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది.

* రాగితో చేసే వీటిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం ఉన్నవారు వీటిని తీసుకోకుండా ఉండడం ఆరోగ్యానికి మేలు.

* ముఖ్యంగా కొందరు అనోరెక్సియా తో బాధపడుతున్న వారు (ఆకలి లేకపోవడం) రాగులను తినడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రాగులతో చేసినవి తింటే ఎక్కువ సేపు ఆకలిని కలిగించదు. ముఖ్యంగా బరువు పెరగాలనుకొనే వారు రాగులను తినకుండా ఉండటం మంచిది.

Advertisement

Next Story

Most Viewed