బుక్కెడు సోంపుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

by Aamani |
బుక్కెడు సోంపుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : సాధారణంగా ఆహారం తిన్న తర్వాత సరిగ్గా జీర్ణం అవ్వడానికి సోంపుని తింటుంటారు. సోంపుని ఆంగ్లంలో ఫెన్నెల్ సీడ్స్ (Fennel seeds) అని అంటారు. చాలా మంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది వర్కవుట్లు చేసి.. బరువు తగ్గడానికి ట్రై చేస్తారు. కొంతమంది డైటింగ్‌ చేసి.. కొవ్వు కరింగించాలని చూస్తారు. సోంపు తినడం వలన కూడా బరువు తగ్గవచ్చంట. సోంపు గింజలను క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు తగ్గే అవకాశం ఉంది. సోంపును చాలామంది ఇష్టంగా తింటారు. దీన్ని ఎక్కువగా మౌత్‌ ఫ్రెషనర్‌గా వాడతారు. సోంపును కూరల్లో, స్వీట్స్‌లో కూడా వేస్తారు. సోంపులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.

సోంపుతో ఇన్ని గుణాలా..?

భోజ‌నం చేసిన వెంట‌నే సోంపును తింటే దాంతో నోరు తాజాగా మారుతుంది. నోటిలో ఉండే బాక్టీరియా, ఇత‌ర క్రిములు న‌శించ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ క్రమంలో దంతాలు, చిగుళ్లు శుభ్రంగా మారుతాయి. వాటిలో ఉన్న స‌మ‌స్యల‌న్నీ తొల‌గిపోతాయి. సోంపులో మాంగ‌నీస్, జింక్‌, కాప‌ర్‌, ఐర‌న్‌, కాల్షియం, పొటాషియం, సెలీనియం, మెగ్నిష‌యం వంటి ఖ‌నిజ ల‌వణాలు ఎన్నో ఉన్నాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. దీంతో ప‌లు ర‌కాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు. శ‌రీరంలో జ‌రిగే ఫ్రీ ర్యాడిక‌ల్స్ న‌ష్టాన్ని నివారించ‌వ‌చ్చు.

గ‌ర్భిణీలకు బెస్ట్ ఫుడ్

ఐర‌న్‌, కాపర్ వంటి పోష‌కాలు ఉండ‌డం వ‌ల్ల సోంపు గింజ‌ల‌తో ర‌క్తం బాగా ప‌డుతుంది. ఇది ర‌క్తహీన‌త ఉన్న వారికి మేలు చేస్తుంది. ఎర్ర ర‌క్త క‌ణాల‌ను ఎక్కువ‌గా త‌యారు చేసేలా చూస్తుంది. గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఇది ఎంత‌గానో మేలు చేసే అంశం.

బరువు, మ‌ధుమేహానికి చెక్

మ‌ధుమేహం ఉన్న వారు భోజ‌నం చేసిన వెంట‌నే సోంపును తింటే దాని వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. సోంపు గింజ‌లు ఇన్సులిన్ సెన్సిటీవిటీని పెంచుతాయి. కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. మెట‌బాలిజం ప్రక్రియ‌ను క్రమ‌బ‌ద్దీక‌రిస్తాయి. ఇది బ‌రువు త‌గ్గేందుకు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. పొటాషియం అధికంగా ఉండ‌డం వ‌ల్ల సోంపు గింజ‌లు బీపీని నియంత్రిస్తాయి. గుండె సంబంధిత స‌మ‌స్యలు రాకుండా చూస్తాయి. ర‌క్తనాళాలు వెడ‌ల్పుగా మారేందుకు స‌హ‌క‌రిస్తాయి. దీంతో ర‌క్తనాళాల్లో కొవ్వు కూడా చేర‌కుండా ఉంటుంది.

చ‌ర్మ స‌మ‌స్యల‌కు దివ్య ఔషధం

సోంపు గింజ‌ల్లో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చ‌ర్మ సంబంధ స‌మ‌స్యల‌ను ప‌రిష్కరిస్తాయి. వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వ‌చ్చే ముడ‌త‌లు త‌గ్గిపోతాయి. చ‌ర్మం మృదువుగా మారుతుంది.

Advertisement

Next Story

Most Viewed