గుండెపోటు రాకుండా ఉండాలంటే అదొక్కటే మార్గం!

by GSrikanth |   ( Updated:2023-03-11 11:33:49.0  )
గుండెపోటు రాకుండా ఉండాలంటే అదొక్కటే మార్గం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న వారిసంఖ్య గణనీయంగా పెరిపోయింది. ముఖ్యంగా యువత ఎక్కువగా హార్ట్ స్ట్రోక్‌కు బలవుతున్నారు. గుండెపోటు రాకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ ఎమ్. అమరేశ్ రావు(హెచ్​వోడీ, కార్డియో థెరఫిక్​ సర్జరీ, నిమ్స్) సూచించారు. ‘బీపీ, షుగర్ వ్యాధులను కంట్రోల్ చేస్తే హార్ట్​స్ట్రోక్ రిస్క్ తగ్గించేనట్టే. దీంతోపాటు లైఫ్​స్టైల్‌లో మార్పులు రావాలి. ఆల్కహాల్, స్మోకింగ్, డగ్స్‌కు దూరంగా ఉండాలి. జంక్​ఫుడ్, మసాల ఆహారాన్ని తగ్గించాలి.

ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, ధ్యానం వంటివి చేయాలి. కొవిడ్, వ్యాక్సిన్లతో హార్ట్ స్ట్రోక్స్​ వస్తున్నాయనే దానిపై ఇప్పటి వరకు సైంటిఫిక్​ప్రూఫ్​లేదు. ఆ ఛాన్స్​కూడా తక్కువే. వాటి వలన ఏదైనా సైడ్​ఎఫెక్ట్ కలిగితే గరిష్టంగా మూడు నెలలలోపు మాత్రమే సంభవిస్తాయి. ఇక గతంలో పోల్చితే ప్రజల్లో అవగాహన పెరగడం, వేగంగా డయాగ్నస్టిక్​చేయడం, సోషల్​మీడియా ప్రభావం పెరగడంతోనే హార్ట్​స్ట్రోక్‌లు ఎక్కువగా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. చెడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ప్రతిరోజు 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. మితిమీరిన జిమ్‌లు కూడా ప్రమాదమే’ అని డాక్టర్ అమరేశ్ రావు సూచించారు.

Read more:

యువతలో పెరుగుతున్న గుండెపోట్లు.. వైద్య నిపుణులు ఏమంటున్నారంటే?

Advertisement

Next Story

Most Viewed