గాంధీలో వైద్య సేవలపై ‘ఈటల’ సమీక్ష

by vinod kumar |
గాంధీలో వైద్య సేవలపై ‘ఈటల’ సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలపై గురువారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కోఠిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా గాంధీ ఆస్పత్రిలో పాజిటివ్ వ్యక్తుల అడ్మిషన్, ట్రీట్‌మెంట్, టెస్టులు, డిశ్చార్జి వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కరోనా పాజిటివ్ వ్యక్తులందరికీ గాంధీలోనే చికిత్స అందిస్తున్నందున.. ఆస్పత్రిని మొత్తం 6 యూనిట్స్‌గా విభజించి ప్రతి యూనిట్‌కు ఒక ప్రొఫెసర్‌ను ఇంచార్జిగా నియమించాలని సూచించారు. అన్ని యూనిట్లలోనూ పేషంట్స్ సమానంగా ఉండేలా చూడాలని సూపరింటెండెంట్ డాక్టర్ రాజరావ్‌ను ఆదేశించారు. ప్రతి కరోనా పేషెంట్‌ను ఉదయం సాయంత్రం పరీక్షించాలని.. డయాబెటిస్, బీపీ ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

గాంధీలో కేవలం కరోనా పాజిటివ్ పేషంట్లు మాత్రమే ఉన్నారు కాబట్టి వైరస్ వ్యాప్తి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా డాక్టర్లు, నర్సులు, పారామెడికల్, శానిటేషన్ సిబ్బంది విధిగా పీపీఈ కిట్స్ ధరించాలని మంత్రి సూచించారు.

Tags : Health Minister, Gandhi Hospital, Review, 6 Units, Command control centre

Advertisement

Next Story