- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిపోర్టులు ఇస్తానని పిలిచి….
దిశ వెబ్ డెస్క్: కేరళలో దారుణం చోటు చేసుకుంది. కరోనా టెస్ట్ ల రిపోర్టుల కోసం వెళ్లిన ఓ మహిళపై వైద్యాధికారి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తిరువనంతపురంలోని పంగోడే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం….మలప్పురంలో హోం నర్సుగా ఓ మహిళ (44) పనిచేస్తున్నారు. ఆమె డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతున్నారు. ఇంతలో ఆమెను క్వారంటైన్‌కు వెళ్లాలంటూ ఆమెకు హెల్త్ ఇన్స్ పెక్టర్ సూచించారు. దీంతో ఆమె యాంటీజెన్ టెస్ట్ లు చేయించుకుంది. అందులో ఆమెకు కరోనా నెగిటివ్ గా తేలింది. అయితే ఆ టెస్ట్ రిపోర్టులను తన ఇంటికి వచ్చి తీసుకువెళ్లాలని ఆ మహిళకు ఆయన తెలిపారు. దీంతో సెప్టెంబర్ 3న అతని ఇంటికి ఆమె వెళ్లింది. అయితే ఇంటికి వచ్చిన మహిళపై ఆ అధికారి అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు ఉదయం ఆమెను వదిలిపెట్టాడు. దీనిపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు.