'తెలంగాణ మరో మహారాష్ట్ర అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి'

by vinod kumar |   ( Updated:2023-05-19 10:42:06.0  )
తెలంగాణ మరో మహారాష్ట్ర అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ దేశాన్ని వణికిస్తుంది. అంతకంతకు కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాధి తీవ్రతపై హెచ్చరికలు, అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణలో కరోనా విజృంభిస్తుందని, అందరు జాగ్రత్తగా ఉండాలని కోరారు. రాబోయే మూడు, నాలుగు వారాల్లో ఇంకా ఎక్కువ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని, ఇలాగే వదిలేస్తే తెలంగాణ మరో మహారాష్ట్ర అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఇప్పటీకే కేసులు పెరిగి ఆసుపత్రుల్లో బెడ్స్ కూడా దొరకని పరిస్థితి నెలకొందని, ముందు ముందు ఆ పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుందని అన్నారు. ప్రభుత్వాలు లాక్ డౌన్ లు, నైట్ కర్ఫ్యూ లు పెట్టడం లేదంటే పరిస్థితిని తీవ్రంగా తీసుకోకపోవడం కాదని, ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందన్న ఉద్దేశంతోనే ఆపుతున్నారని అన్నారు. ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణ, స్వీయ జాగ్రత్తలు తీసుకోకపొతే పరిస్థితి ఇంకా విషమంగా మారుతుందని తెలిపారు. ఇప్పుడున్న వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతుందని అన్నారు. అందరు కరోనా జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా మాస్క్ ధరిస్తూ, సామాజిక దూరం పాటించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed