మీకు తెలుసా : తంగేడు పువ్వుతో టీ.. ఆ సమస్యలకు చెక్

by Anukaran |
మీకు తెలుసా : తంగేడు పువ్వుతో టీ.. ఆ సమస్యలకు చెక్
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో తంగేడు పువ్వుకు ఉన్న ప్రత్యేకతే వేరు. తంగేడు పువ్వును ఓ అమ్మవారిలా కొలుస్తారు. ఇక బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు ఈ పువ్వుకు ఉన్న డిమాండ్ తగ్గేదే లేదన్నట్టు ఉంటుంది. అయితే దీని ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. తంగేడు పూల టీ ఆరోగ్యానికి చాలా మంచిదంట. పువ్వుతో టీ ఏంటీ అని అందరూ ఆశ్చర్యపోతుంటారు కానీ ఇలాంటి వాటిలోనే ఎక్కువగా ఔషధగుణాలు ఉంటాయని చెబుతున్నారు పెద్దలు.

చాలా వరకు మహిళలు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు. అయితే ఈ టీ తాగడం వలన ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు వైద్యులు. నీటిలో పువ్వులు, లేదా పువ్వు పొడి వేసి మరగ బెట్టాలి అనంతరం దాన్ని వడపోసుకొని తాగాలి.. ఇందులో తేనె కలుపుకొని కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారు తేనె కలుపుకుని తీసుకోవాలని వైద్యుల సూచన. ఈ టీ తాగడం వలన మహిళలో పీరియడ్స్ సమస్యలు, కడుపులో పుండు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు ఇది చెక్ పెడుతోంది. అంతే కాకుండా ఇది శరీరానికి డిటాక్సిఫైయర్‌గా పనిచేసి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తోంది. ఇక జ్వరం, పిత్తం,మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది దివ్య ఔషదం.

Advertisement

Next Story

Most Viewed