అల్లం ‘టీ’ ఆరోగ్యానికి మేలు..

by sudharani |   ( Updated:2021-07-13 22:17:50.0  )
అల్లం ‘టీ’ ఆరోగ్యానికి మేలు..
X

దిశ, వెబ్‌డెస్క్ : అల్లం టీ‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలా మందికి ఉదయాన్నే వేడి వేడి టీ గొంతులో పడితే గానీ మనసు ఊరుకోదు. ఉదయాన్నే టీ తాగిన వారు చాలా ఉత్సాహంగా కూడా పనిచేస్తారు. టీకి అల్లం జోడిస్తే ఆరోగ్యానికి మంచిది కూడా. దీనిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, మెగ్నీషియం, మినరల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి అంటున్నారు నిపుణులు. అయితే ఇప్పుడు ఈ అల్లం టీతో ప్రయోజనాలు ఏంటో చూద్దాం.

అల్లం టీతో ప్రయోజనాలు…

  • జీర్ణక్రియ మెరుగుపరచడంలో అల్లం టీ చాలా ఉపయోగపడుతోంది. అంతే కాకుండా ప్రయాణానికి ముందు అల్లం టీ తాగితే వికారం, వాంతులు కాకుండా ఉంటంది.
  • జలుబు తగ్గుముఖం పడుతుంది.
  • అల్లం టీ‌తో రక్తప్రసరణ మెరుగుపడుతోంది.
  • హృద్రోగ సమస్యలను నివారిస్తుంది.
  • 40 ఏళ్లు దాటితే చాలు నడుము నోప్పి, కీళ్ల నొప్పులు బాధిస్తుంటాయి. అయితే అలాంటి వారు అల్లంటీని రోజూ తీసుకుంటే సమస్య చాలా వరకు తగ్గుముఖం పడుతుంది.
  • సీజనల్ వ్యాధులకు అల్లం టీతో చెక్ పెట్టవచ్చు. జలుబు, ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి సమస్యలకు అల్లం టీ అద్భుతంగా పనిచేస్తుంది.
Advertisement

Next Story

Most Viewed