కరక్కాయతో ఎన్ని ప్రయోజనాలో..!

by sudharani |   ( Updated:2021-01-20 07:34:23.0  )
కరక్కాయతో ఎన్ని ప్రయోజనాలో..!
X

దిశ, వెబ్‌డెస్క్: అనేక రోగాలకు దివ్యౌషధాలు కలిగిన వాటిలో కరక్కాయ ఒకటి. ఇది వాతగుణాలను తగ్గించడమే కాకుండా ఆయుష్షును పెంచుతుంది. దీనిలో ఉప్పు తప్ప అన్ని రుచులు ఉంటాయి. మలబద్ధకాన్ని నివారించడానికి సరైన ఔషధం కరక్కాయ.

కరక్కాయలో చలువ చేసే గుణం ఉంటుంది. దగ్గుతో బాధపడేవారు కరక్కాయ బుగ్గన ఉంచుకుంటే ఉపశమనం కలుగుతుంది. కరక్కాయ ముక్కలను నీళ్లలో నానపెట్టి, ఆ నీటిని తాగితే గుండెకు బలం చేకూరుతుంది. ఇది పొట్ట ఉబ్బరం, ఎక్కిళ్లు, వాంతులను తగ్గిస్తుంది. వాంతులు అవుతున్నప్పుడు కరక్కాయ పొడిని మంచినీళ్లలో తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. కరక్కాయను అరగదీసి ఆ గంధాన్ని నుదుటన పట్టిస్తే తలనొప్పి కళ్లు మంటలు తగ్గుతాయి. ఈ పొడిలో మెత్తని ఉప్పు చేర్చి పండ్లు తోముకుంటే చిగుళ్లు గట్టిపడి పంటి వ్యాధులు రావు.

భోజనానికి అరగంట ముందు కరక్కాయ చూర్ణానికి కొంచెం బెల్లం కలిపి అరచెంచాడు మోతాదుగా రెండు పూటలా తీసుకుంటుంటే రక్తమొలలు తగ్గిపోతాయి. కరక్కాయ చూర్ణాన్ని అరటీస్పూన్ చొప్పున రెండు పూటలా ఆముదంతో కలిపి తీసుకుంటే కీళ్లనొప్పిలో ఉపశమనం లభిస్తుంది. కరక్కాయ పెంకులు, వస ఆకులు కలిపి రెండు రోజులు నానబెట్టాలి. తర్వాత వీటిని ఎండబెట్టి పొడిచేసి పూటకు అర టీస్పూన్ చొప్పున నేరుగా లేదా తేనెతో కలిపి తీసుకుంటే అవయవాల్లో అంతర్గత రక్తస్రావం ఆగుతుంది. కరక్కాయ, శొంఠి, తానికాయ, పిప్పళ్లు చూర్ణాలను సమానంగా కలిపి నిల్వచేసి, అర టీస్పూన్ చొప్పున రోజుకు మూడుసార్లు తేనె లేదా నీటిలో కలిపి తీసుకుంటే దగ్గుతోపాటు ఆయాసం కూడా తగ్గుతుంది.

Advertisement

Next Story

Most Viewed