పన్నీర్ వల్ల ప్రయోజనాలు

by sudharani |
పన్నీర్ వల్ల ప్రయోజనాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇదివరకు ఆహారంలో పన్నీరు పదార్ధాన్ని తక్కువగా తీసుకునేవారు. అయితే ఇప్పుడు వస్తున్న కొత్త కొత్త ఆహార పదార్థాల్లో చాలామంది పన్నీరు తీసుకోవడం పరిపాటి అయింది. మాంసాహారులకు చికెన్ ఎలాగో శాకాహారులు పన్నీర్‌ను అలా ఇష్టపడుతుంటారు. పాల నుంచి తయారయ్యే పన్నీర్‌లో అనేక పోషకాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

పన్నీర్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పూర్తి క్రీమ్ పాలు నుండి వచ్చినట్లయితే, ప్రోటీన్ ఎక్కువగా ఉండటంతో పాటు కొవ్వు కూడా అధికంగా ఉంటుంది. పన్నీర్‌లో ఇనుము తప్ప దాదాపు శరీరానికి అవసరమైన ఖనిజాలు లభిస్తాయి. అలాగే పన్నీర్‌లో కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. పన్నీర్‌లో కాల్షియం అధికంగా ఉండడంతో ఎముకలు, దంతాలను బలోపేతం చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడుతుంది.

పచ్చిగా ఉండే పన్నీరు ఆహారంగా తీసుకోవడం ద్వారా ఎముకలకు ఎంతో బలం చేకూర్చుతుంది. అలాగే కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు. పన్నీర్‌ను డైలీ తీసుకోవడం ద్వారా రక్తపోటు, లిపిడ్ శాతాలు కూడా అదుపులో ఉంటాయి. దీనిలో ఉండే పొటాషియం మీ రక్తపోటును నియంత్రించడంలో సహయపడుతుంది. పన్నీర్‌లోని పీచుపదార్థం జీవక్రియను పెంచి బరువు తగ్గటంలో తోడ్పడుతుంది. వీటిలో ఉండే ప్రొటీన్, మంచి కొవ్వులు ఎదిగే పిల్లలకు పోషకాలందించి వారి రోగనిరోధకశక్తిని పెంచుతుంది.

పన్నీర్‌లో విటమిన్ బి, ఒమెగా-3 మరియు 6 ఫ్యాటీ యాసిడ్లు, యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. దీంతో జుట్టుకి, చర్మానికి మంచిది. చర్మం ముడతలు పడకుండా, వాపు కలిగించే డెర్మటైటిస్‌ను ఆపడానికి పన్నీర్ సహయపడుతుంది. దీనిలో ఉండే బి-కాంప్లెక్స్ విటమిన్ గర్భిణీ స్త్రీలకు చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed