- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొత్తిమీర కాడలను పారేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి ?
దిశ, వెబ్‌డెస్క్ : కూరలో కొత్తిమీరకు ఉండే ప్రాధాన్యతే వేరు. మన వంటకాలలో కొత్తిమీర ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఏ కూర వండినా సరే అందులో కొత్తిమీర ఉండాల్సిందే, ఎందుకంటే కొత్తిమీర కూరకు రుచితో పాటు, మంచి వాసన ఇస్తుంది. అంతే కాకుండా కొత్తిమీర ఆరోగ్యానికి ఎంతో మంచిది. కొత్తిమీరలో ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం సోడియం, విటమిన్ ఎ, బీ, సీ, వంటి పోషకాలు ఉంటాయి. అయితే కొత్తిమీతోనే కాకుండా కొత్తిమీర కాడలతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు వైద్య నిపుణులు. కొత్తిమీర కాడలో విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా కొత్తిమీర తింటే ఐరన్ కుడా లభిస్తుంది. చాలా మంది కొత్తిమీర కాడల ప్రయోజనాలు తెలియక, కొత్తిమీర ఆకులను తెంపి, కొత్తిమీర కాడలను పారేస్తూ ఉంటారు. అయితే కొత్తిమీర కాడలతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. లేతగా, రుచి పోషకాలతో నిండి ఉన్న ఈ కొత్తిమీర కాడలతో ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
- చర్మ సంరక్షణలోనూ కొత్తిమీర కాడలు కీలకపాత్ర పోషిస్తుంది. ఎండలో ఎక్కువగా తిరిగేవారి శరీరాన్ని ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది.
- కొత్తిమీర కాడలో సిట్రోనెలోల్ పుష్కలంగా ఉంటుంది, ఇది మన శరీరంలో సూక్ష్మజీవుల పెరుగుదలతో పోరాడటానికి, అల్సర్‌లకు చికిత్స చేసే గొప్ప క్రిమినాశక.
- కొత్తిమీర కాడలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఒత్తిడిని తగ్గించడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. త్వరగా ఒత్తిడి, ఆందోళన చెందడాన్ని అదుపుచేస్తుంది. అందు వలన కొత్తమీర కాడలను తీసివేయక పోవడమే మంచిది.
- కొత్తిమీరలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు శక్తివంతమైన యాంటిఆక్సిడంట్ల వలె కూడా పనిచేస్తాయి. ఈ సమ్మేళనాలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమబద్ధీకరించడంలో కూడా సహాయపడతాయి.
- కొత్తిమీర ఆహారాన్ని రుచి గానే కాకుండా, జీర్ణక్రియ రేటుని కూడా పెంచును. అంతే కాకుండా జీర్ణక్రియ వ్యాధులను, అజీర్ణం, వాంతులు, వంటి వాటిని తగ్గించడానికి ఈ కొత్తిమీర కాడలు ఎంతగానో ఉపయోగ పడుతుంటాయి.
- రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కొత్తిమీర ఆకులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడే యాక్టివేటెడ్ ఎంజైమ్‌లతో నిండి ఉన్నాయని వివిధ అధ్యయనాలు నిర్ధారించాయి. రక్తం నుండి చక్కెరను తొలగించడం. తద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోగలుగుతారు.