క్యారెట్ తింటే ఎన్ని ప్రయోజనాలో..!

by sudharani |
క్యారెట్ తింటే ఎన్ని ప్రయోజనాలో..!
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్లను అందించే వాటిలో క్యారెట్ ఒకటి. కొంతమంది క్యారెట్‌తో చేసిన వంటకాలను తినేందుకు ఇష్టపడతారు. మరికొందరు పచ్చిగా తినేందుకు లేదా జ్యూస్ చేసుకుని తాగేందుకు ఇష్టపడుతుంటారు. అయితే క్యారెట్ ప్రతిరోజు తినడం ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

క్యారెట్‌‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్‌‌లు పుష్కలంగా ఉన్నాయి. దీనిలో విటమిన్-ఎ అధికంగా ఉండడంతో కంటి చూపు మెరుగవుతుంది. క్యారెట్‌లోని ఫ్లావనాయిడ్‌ కాంపౌండ్స్‌ చర్మాన్ని, ఊపిరితిత్తులకు రక్షణ కల్పిస్తాయి. దీనిని ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది. దీనిలో ఉండే ఫాల్కరినల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ క్యాన్సర్‌పై పోరాడేందుకు ఉపయోగపడుతుంది.

క్యారెట్‌లో ఉండే ఫోలిక్‌ యాసిడ్‌, పిరిడాక్సిన్‌, థయామిన్‌ వంటివి విటమిన్లు జీవక్రియను క్రమంగా ఉంచుతాయి. దీంతో కాలేయంలో కొవ్వులు పేరుకుపోకుండా క్యారెట్ ఉపయోగపడుతుంది. క్యారెట్‌ దంతాలు, చిగుళ్లకు మేలు చేస్తుంది. దీనిలో కాల్షియం, కాపర్‌, పొటాషియం, మాంగనీస్‌, ఫాస్ఫరస్‌ వంటి మినరల్స్‌ కూడా ఉంటాయి. క్యారెట్ రోజు ఆహారంలో తీసుకుంటే లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ ముప్పు ఉండదని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్‌లో ఉండే అత్యధిక కెరోటినాయిడ్స్, ఆల్ఫా కెరోటిన్, లూటిన్‌లు గుండె వ్యాధులను నివారిస్తుంది.

అంతే కాకుండా క్యారెట్ చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. తరచుగా క్యారెట్ తింటే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ప్రతిరోజూ క్యారెట్ తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో ఉండే విటమిన్లు, కార్బైడ్స్ మీ జట్టు పొడిబారకుండా చేస్తుంది. క్యారెట్ ఎముకలకు మరింత బలాన్ని, గట్టిదనాన్ని అందిస్తుంది. నిద్రలేమికి కూడా క్యారెట్‌ దివ్య ఔషధంలా పనిచేస్తుంది. నిద్రలేమితో బాధపడుతుంటే ప్రతి రోజు రెండు పూటలా క్యారెట్ జ్యూస్‌ను తాగితే చక్కగా నిద్రిస్తారు.

Advertisement

Next Story

Most Viewed