పోలీస్‌స్టేషన్‌లో కొట్టుకున్న ఖాకీలు.. Sp సీరియస్..!

by srinivas |   ( Updated:2021-08-12 08:07:22.0  )
pitapuram
X

దిశ, వెబ్‌డెస్క్ : పౌర సమాజానికి రక్షణగా నిలవాల్సిన ఇద్దరు ఖాకీలు తమ స్థాయిని మరిచి విపరీతంగా కొట్టుకున్నారు. ఈ ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పోలీస్‌స్టేషన్‌లో గురువారం సాయంత్రం వెలుగుచూసింది. అయితే, వీరిద్దరికి కంప్యూటర్ విషయంలో వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సై పై క్రమశిక్షణా చర్యల కింద వేటు పడింది. స్టేషన్‌లో పరస్పరం పోలీసులు దాడి చేసుకోవడంపై జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ వీఆర్‌ కు అటాచ్ చేశారు.

Advertisement

Next Story