‘ రాసలీలల వీడియోని ఆయనే విడుదల చేశారు’

by Sumithra |
‘ రాసలీలల వీడియోని ఆయనే విడుదల చేశారు’
X

దిశ,వెబ్ డెస్క్ : ఉద్యోగం ఇప్పిస్తానని మంత్రి ఓ యువతితో జరిపిన రాసలీలల వీడియోలు దేశమంత వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ వీడయోల పై ఆ యువతి తొలిసారిగా స్పందించింది. 11రోజుల తర్వాత అజ్ఞాతంలో నుంచి బయటపడిన యువతి గత రాత్రి సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసింది. కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించారని, తనతో సన్నిహితంగా ఉన్న వీడిమో సీడీని ఆయనే విడుదల చేశారని బాధిత యువతి పేర్కొంది. వీడియో ఎవరు ఎప్పుడు చిత్రీకరించారన్న విషయం తనకు తెలియదన్నది.

ఆ వీడియో బయటకు వచ్చిన అనతరం తాను బాధతో మూడు నాలుగు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపింది. తనకు ఎవరూలేరని తన తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అలానే తనకు రక్షణ కల్పించాల్సిందిగా రాష్ట్రహోం మంత్రి బసవరాజు బొమైని కోరింది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృదం ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. బాధిత యువతి ఆజ్ఞానం నుంచే వీడియోను విడుదల చేయడంతో తనని కనుగొనడం పోలీసులకి కష్టంగా మారింది.

Next Story

Most Viewed