మాజీ ప్రధాని దేవేగౌడకు పాజిటివ్

by Shamantha N |
మాజీ ప్రధాని దేవేగౌడకు పాజిటివ్
X

న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ లీడర్ హెచ్‌డీ దేవేగౌడ కరోనా బారినపడ్డారు. ఆయన సతీమణికీ పాజిటివ్ వచ్చినట్టు దేవేగౌడ స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. ‘నా భార్య చెన్నమ్మకు, నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. మేం, మా ఇతర కుటుంబ సభ్యులతోపాటుగా సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉన్నాం. ఇటీవలే మా కాంటాక్ట్‌లోకి వచ్చినవారంతా టెస్టు చేసుకోవాలని కోరుతున్నాను. మా ఆరోగ్యంపై పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు కంగారుపడవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story