రాజస్తాన్‌‌లో ప్రమాదం.. HCU ప్రొఫెసర్ మృతి

by Sumithra |
HCU Professor Bhavani died in Udaipur
X

దిశ, గచ్చిబౌలి: గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, హిందీ ఇన్‌స్ట్రక్టర్‌ ప్రొఫెసర్‌ భవానీ ఆదిమూలం(40) రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. భవానీ కొంతకాలంగా ఉదయ్‌పూర్‌లో పర్యావరణ సంరక్షణపై అవగాహన కల్పించడంలో భాగంగా ‘శిక్షాంతర్‌ ఆందోళన్‌’ కార్యక్రమంలో పని చేస్తున్నారు. అయితే స్కూటీపై ప్రయాణిస్తున్న సమయంలో అదుపుతప్పి కిందపడిపోవడంతో.. వెనుక నుంచి వచ్చిన ట్రక్‌ అదే సమయంలో ఆమె మీద నుంచి వెళ్లడంతో భవానీ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆమె కూతురుకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో గురువారం వర్సిటీలో ఆమె చిత్రపటానికి సిబ్బంది, విద్యార్థులు పూలమాలవేసి నివాళి అర్పించారు.

Advertisement

Next Story