- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: HCA ప్రెసిడెంట్ అజారుద్దీన్ సభ్యత్వం రద్దు…
దిశ, స్పోర్ట్స్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్‌పై వేటు పడింది. బోర్డు వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నట్లు పలు పిర్యాదులు అందడంతో హెచ్‌సీఏ అత్యున్నత కమిటీ అతడి సభ్యత్వాన్ని రద్దు చేసింది. దర్యాప్తు ముగిసే వరకు అతడిని హెచ్‌సీఏ నుంచి బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నది. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయవిచారణ ముగిసే వరకు అతడిని అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు షోకాజ్ నోటీసు జారీ చేసింది. హెచ్‌సీఏలోని పలువురు సభ్యులు మహ్మద్ అజారుద్దీన్‌పై హెచ్‌సీఏకు ఫిర్యాదు చేశారు. దీంతో జూన్ 10న హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ ప్రత్యేకంగా భేటీ అయ్యింది. అతడిపై వచ్చిన పిర్యాదులను జాగ్రత్తగా పరిశీలించిన అనంతరం రూల్ నెంబర్ 41(1)(బి), 15(4)(సి) ప్రకారం నోటీసులు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నది.
సభ్యులు చేసిన ఆరోపణలపై న్యాయ విచారణ జరిగి, తీర్పు వెలువడే వరకు రూల్ నెంబర్ 40(6) ప్రకారం సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహ్మద్ అజారుద్దీన్ దుబాయ్‌లో నార్తరన్ వారియర్స్ అనే క్రికెట్ క్లబ్‌కు మెంటార్‌గా ఉన్నాడు. ఈ క్లబ్ అక్కడ నిర్వహించే టీ10 టోర్నమెంట్‌లో పాల్గొంటున్నది. అయితే ఈ టీ20 టోర్నీని బీసీసీఐ గుర్తించలేదని.. అనధికార టోర్నీలో పాల్గొనే క్లబ్‌కు మెంటార్‌గా ఉండటం నిబంధనలకు విరుద్దమని పిర్యాదు చేశారు. అంతే కాకుండా హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉంటూ.. ఏ రోజుకూడా తాను ఒక క్లబ్‌కు మెంటార్‌గా ఉంటున్న విషయం అసోసియేషన్‌కు గానీ, బీసీసీఐకి గానీ చెప్పలేదని పిర్యాదులోపేర్కొన్నారు. ఒక అనధికార లీగ్‌లో క్లబ్‌కు మెంటార్‌గా ఉండటం హెచ్‌సీఏ రూల్ 38(1)(3) ప్రకారం పరస్పర విరుద్ద ప్రయోజనాల కిందకు వస్తుందని అపెక్స్ కౌన్సిల్ జారీ చేసిన షోకాజ్ నోటీసులో పేర్కొన్నది.
మరోవైపు అజారుద్దీన్ ఇప్పటి వరకు క్రికెట్ నుంచి రిటైర్ అయినట్లు ప్రకటించలేదనే ఆరోపణ కూడా ఉన్నది. 2019 డిసెంబర్ 14న హెచ్‌సీఏ కార్యదర్శికి రాసిన లేఖలో తాను 2000 మార్చి 6న (అజర్ ఆడినే చివరి మ్యాచ్ డేట్) రిటైర్ అయినట్లు బీసీసీఐకి తెలియజేయమంటూ పేర్కొన్నాడు. అంతే కానీ 2019కి ముందు తాను క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు బీసీసీఐకి గానీ, హెచ్‌సీఏకి గానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇది కూడా నిబంధనల ప్రకారం నేరమే. ఎందుకంటే ఎవరైనా మాజీ క్రికెటర్ బీసీసీఐ లేదా అనుబంధ అసోసియేషన్ల పాలక మండలిలో సభ్యుడు లేదా ఇతర హోదాలో నియమించ బడాలంటే రిటైర్ అయిన దగ్గర నుంచి 5 సంవత్సరాలు గడిచిపోవాలి.
కానీ అజారుద్దీన్ తన రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రకటన చేయకుండా.. 2019లో మాత్రం తాను చివరి మ్యాచ్ ఆడిన రోజునే రిటైర్ అయినట్లు భావించమనే ఉద్దేశంతో లేఖ రాశాడు. దీన్ని కూడా అపెక్స్ కౌన్సిల్ పరిగణలోకి తీసుకున్నది. దిల్‌షుక్‌నగర్ కెనరా బ్యాంకులో హెచ్‌సీఏకు ఉన్న బ్యాంకు అకౌంట్‌కు సంబంధించిన లావాదేవీల విషయంలో కూడా వివాదం చోటు చేసుకున్నది. అంతే కాకుండా హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌గా జస్టీస్ దీపక్ వర్మను నియమించడానికి అక్రమ మార్గాన్ని అనుసరించినట్లు కూడా అజార్‌పై ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటినీ పరిశీలించిన హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ అజారుద్దీన్‌పై వేటు వేసింది. హెచ్‌సీఏకు సంబంధించిన ఏ సమావేశంలోనూ పాల్గొనరాదని.. ఎలాంటి అధికారిక లేఖలు రాయకూడదని ఆ షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కార్యదర్శి విజయానంద్, ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, సంయుక్త కార్యదర్శి నరేశ్ శర్మ, కోశాధికారి సురేందర్ కుమార్ అగర్వాల్, కౌన్సిలర్ పి అనురాధ పాల్గొన్నారు.