వ్యాక్సిన్ తీసుకున్న మంత్రికి కరోనా

by Shamantha N |
వ్యాక్సిన్ తీసుకున్న మంత్రికి కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న హర్యానా మంత్రికి కరోనా పాజటివ్ నిర్ధారణ అయింది. ఇటీవలే ట్రయల్స్‌లో భాగంగా మంత్రి అనిల్ విజ్ టీకాను వేయించుకున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న కొద్ది రోజులకు కరోనా టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ తేలినట్లు ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మధ్యకాలంలో తనతో సన్నిహితంగా మెలిగిన ప్రతి ఒక్కరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని, హోం క్వారంటైన్ కావాలని కోరారు.

కాగా, హర్యానాలో కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ మంత్రి అనిల్ విజ్‌తోనే ప్రారంభమయ్యాయి. నవంబర్ 20వ తేదీన ఆయన వాలంటీర్ రూపంలో వ్యాక్సిన్ తీసుకున్నారు.

Advertisement

Next Story