యూరప్‌లోని ఎత్తైన శిఖరంపై రెపరెపలాడిన జాతీయ జెండా..

by Sujitha Rachapalli |   ( Updated:2021-07-14 03:31:16.0  )
europ-flag
X

దిశ, ఫీచర్స్ : హర్యానాలోని స్లమ్ ఏరియాకు చెందిన పర్వతారోహకుడు.. యూరప్‌లోనే ఎత్తైన పర్వతాన్ని అధిరోహించి భారత మువ్వన్నెల పతాకాన్ని ఎగరేశాడు. సిర్సా జిల్లా, ఎల్లెనాబాద్‌కు చెందిన హుకంచంద్ అలియాస్ చాంద్.. స్థానికంగా ఉండే వివిధ ఆర్గనైజేషన్ల నుంచి సేకరించిన డొనేషన్స్‌తో రష్యాకు వెళ్లి, గురువారం ఆ దేశంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎల్‌బ్రస్ శిఖరాన్ని సక్సెస్‌ఫుల్‌గా ఎక్కేశాడు. దీంతో స్థానికులు సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు.

ఎల్లెనాబాద్ సిటీలోని స్లమ్ ఏరియాలో నివసించే చాంద్.. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్‌లో గల 15,500 అడుగుల నుంచి 18000 అడుగుల ఎత్తైన 6 పర్వతాలను అధిరోహించాడు. ఇక వివిధ సోషల్, రిలీజియస్ సంస్థలు ఈ క్యాంపెయిన్‌లో పాల్గొనేందుకు తోడ్పడ్డాయి. రష్యాకు వెళ్లేందుకు విమాన టికెట్‌‌తో పాటు స్నో షూస్, వెదర్ జాకెట్స్ కొనేందుకు కూడా తన దగ్గర డబ్బులు లేకపోవడంతో స్థానిక సోషల్ ఆర్గనైజేషన్స్ ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేశాయి. ఈ మిషన్‌లో భాగంగా ఏప్రిల్ 1న రష్యాకు బయలుదేరిన చాంద్.. ఈ నెల 13న స్టార్ట్ చేసి గురువారం ఉదయం 18500 అడుగుల ఎత్తున్న మౌంట్ ఎల్‌బ్రస్ పర్వతం పైకి చేరుకున్నాడు.

అత్యధిక వయసున్న మహిళగా రికార్డ్..

చాంద్‌తో పాటు మధ్యప్రదేశ్‌‌లోని భోపాల్‌కు చెందిన 52 ఏళ్ల మహిళ జ్యోతి రాత్రే కూడా ఈ ఫీట్ సాధించింది. ఈ మేరకు మౌంట్ ఎల్‌బ్రస్ పర్వతాన్ని ఎక్కిన అత్యధిక వయసున్న మహిళగా రికార్డ్ సృష్టించింది. ఈ నెల 2న తన జర్నీ స్టార్ట్ చేసిన జ్యోతి.. 8వ తేదీన పూర్తిచేసింది. ఈ క్రమంలో కొన్నిసార్లు ఉష్ణోగ్రతల కారణంగా ఇబ్బంది ఎదుర్కొన్నట్టు తెలిపింది.

Read More: భూమి వైపు ఎన్ని నక్షత్రాలు చూస్తున్నాయో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed