- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రయల్ టీకా డోసు వేసుకున్న హర్యానా మంత్రి
X
చండీగఢ్: హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ శుక్రవారం కోవాగ్జిన్ ట్రయల్ టీకా వేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్, ఐసీఎంఆర్‌తో కలిసి తయారుచేస్తున్న కరోనా టీకా కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ హర్యానాలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ టీకా ట్రయల్స్ వేగంగా సాగాలని, వాలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్ర మంత్రి అనిల్ విజ్ తొలి వాలంటీర్‌గా ముందుకొచ్చారు. ట్రయల్స్‌లో భాగంగా తొలి డోసు తీసుకున్నాక గంట సేపు అతన్ని అబ్జర్వేషన్‌లో ఉంచారు. టీకా వేయించుకున్న రెండు గంటల తర్వాత మళ్లీ ఆఫీసుకు వెళ్లి బాధ్యతల్లో మునిగిపోయారు. ‘మన వైద్యులపై నాకు నమ్మకమున్నది. దేశీయంగా తయారుచేస్తున్న టీకాను వేసుకోవడం గర్వంగా ఉన్నది. నాలాగే, ఇతరులూ వాలంటరీకోసం ముందుకొస్తే ట్రయల్స్ వేగంగా ముగుస్తాయి’ అని పేర్కొన్నారు.
Advertisement
Next Story