- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
భారీ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ మాజీ సీఎం
X
దిశ, డైనమిక్ బ్యూరో: హర్యానా మాజీ సీఎం భుపిందర్ సింగ్ హుడాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. భూపిందర్ సింగ్ హుడా ప్రయాణిస్తున్న టయోటా ల్యాండ్ క్రూయిజర్ కారు ప్రమాదానికి గురైంది. ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా మార్గం మధ్యలో ఓ నీలుగాయి(మనుబోతు) కారుకు అడ్డం రావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ధాటికి ముందు సీటులోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో భారీ నష్టం తప్పింది.
ఈ ఘటనలో ఆయనతో పాటుగా కారులో ప్రయాణిస్తున్న కొందరికి స్పల్ప గాయాలయ్యాయి. హర్యానాలోని హిసర్ జిల్లాలో బార్వాలా అనే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమైంది. ‘దేవుడి దయ, మీ అందరి ఆశీర్వాదాల వల్ల నేను క్షేమంగానే ఉన్నాను’ అంటూ భుపిందర్ సింగ్ ట్వీట్ చేశారు. మరో వాహనంలో ఆయనను తరలించడంతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు.
Advertisement
Next Story