డేంజర్ బెల్స్.. గాలి పీలిస్తే పై ప్రాణాలు పైకి పోవాల్సిందే

by Shamantha N |   ( Updated:2021-02-10 02:01:51.0  )
డేంజర్ బెల్స్.. గాలి పీలిస్తే పై ప్రాణాలు పైకి పోవాల్సిందే
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రతి సంవత్సరం మన దేశంలో సంభవించే మరణాల్లో 30శాతం మరణాలు శిలాజ ఇంధనాలు (బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు) వల్ల నమోదవుతున్నాయని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రకటించింది. బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ, లీసెస్టర్ యూనివర్సిటీ, యూనివర్శిటీ కాలేజ్ లండన్ నిర్వహించిన సంయుక్త పరిశోధనల్లో తేలిందని జర్నల్ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ లో పేర్కొంది. అంతేకాదు పైన పేర్కొన్న యూనివర్సిటీ సైంటిస్ట్‌లు చైనా – భారత్ లో చేసిన రీసెర్చ్ లో ఈ రెండు దేశాల ప్రజలు ఎక్కువ మంది గాలి నుంచి విడుదలయ్యే విషవాయువులైన నైట్రోజన్‌ డై ఆక్సయిడ్‌, కార్బన్‌ మోనాక్సయిడ్‌’లను పీల్చి ప్రాణాలు కోల్పోతున్నట్లు గుర్తించారు.

ఇండియాలో శిలాజ ఇంధనాల వల్ల గాలి కాలుష్యం అవుతుందని, ఆ గాలి కాలుష్యం వల్ల ఉత్తర ప్రదేశ్ లో సుమారు 4.7లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు నిర్ధారించింది. బీహార్ మొత్తం జనాభాలో 2.8లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు సైంటిస్ట్‌ల రిసెర్చ్ లో తేలింది. చైనాలో గాలి కాలుష్యం నివారించే ప్రయత్నాలు చేపట్టడం వల్ల 2012 లో మొత్తం మరణాలలో 21.5 శాతం నుండి 2018 లో 18 శాతానికి తగ్గాయని పరిశోధకులు గుర్తించారు.

సైంటిస్ట్‌ల రీసెర్చ్ ఆధారంగా జర్నల్ లో పేర్కొన్న వివరాల ప్రకారం.. శిలాజ ఇంధనాల వల్ల ఈస్ట్రన్ నార్త్ అమెరికా, యూరప్, సౌత్ ఈస్ట్ ఏసియాలలలో మరణాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా శిలాజ ఇంధనాల వల్ల ప్రతీ ఐదు మందిలో ఒకరు మరణిస్తున్నట్లు సైంటిస్ట్ లు కనిపెట్టారు. 2018లో 8లక్షల మంది గాలికాలుష్యం వల్లే మరణించినట్లు వెల్లడించారు.

ఈ అంశాలన్నీ శాటిలైట్ మరియు ఉపరితల లేదా పార్టిక్యూలేట్ మేటర్ (రేణువు పరిణామాన్ని గుర్తించే సాధనం) ద్వారా ప్రపంచలోని కొన్ని దేశాలకు చెందిన ప్రజలు వారు నివసించే ప్రాంతాల్లో దుమ్ము, దూళి, పొగ, ఇతర శిలాజ ఇంధనాల నుండి వెలువడే కణాల ఆధారంగా ఈ రీసెర్చ్ జరిగినట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కడ ఎక్కువగా ఉందనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్ని సెలక్ట్ చేసుకొని తద్వారా రీసెర్చ్ లో వెలుగులోకి వచ్చిన వాస్తలపై ఓ క్లారిటీకి వచ్చినట్లు బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ సైంటిస్ట్ కర్నో వోహ్రా తెలిపారు.

మరో కోటీ 45 లక్షల వ్యాక్సిన్లకు కేంద్రం ఆర్డర్

Advertisement

Next Story

Most Viewed