దేశీయ విమానయాన చరిత్రలో తొలి మహిళా సీఈవో

by Harish |
దేశీయ విమానయాన చరిత్రలో తొలి మహిళా సీఈవో
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ విమానయాన చరిత్రలోనే తొలిసారిగా ఓ మహిళ దేశీయ విమానయ సంస్థ ఎయిర్ ఇండియా (Air india)కు సీఈవోగా బాధ్యతలను తీసుకోనున్నారు. ఎయిర్ ఇండియా చీఫ్‌గా హర్‌ప్రీత్ సింగ్‌ (Haripreet singh) ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను ఇచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు హర్‌ప్రీత్ ఎయిర్ ఇండియా సీఈవోగా ఉండనున్నారని సంస్థ సీఎండీ రాజీవ్ బన్సాల్ (Rajeev bansal) తెలిపారు.

హర్‌ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆమె స్థానంలో కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నివెదా భాసిన్ బాధ్యతలు తీసుకుంటారు. ఎయిర్ ఇండియాకు తొలి మహిళా పైలెట్‌గా కూడా హర్‌ప్రీత్ సింగ్ కావడం గమనార్హం. అయితే, అనారోగ్య సమస్యలతో పైలెట్‌గా కొనసాగలేదు. భద్రతా విభాగంలో కొనసాగారు. తర్వాత ఇండియన్ ఉమెన్ పైలెట్ అసోసియేషన్‌కు హెడ్‌గా కూడా వ్యవహరించారు. కాగా, దేశీయంగా ఉన్న విమానయాన సంస్థల్లో ఎక్కువమంది మహిళా పైలెట్లు ఉన్నది కూడా ఎయిర్ ఇండియాలోనే కావడం విశేషం.

Advertisement

Next Story