అందంతో ఫ్యాన్స్ మతి పోగొడుతున్న టీమిండియా మహిళా క్రికెటర్.. పిక్స్ వైరల్

by Anukaran |   ( Updated:2021-12-19 02:39:24.0  )
అందంతో ఫ్యాన్స్ మతి పోగొడుతున్న టీమిండియా మహిళా క్రికెటర్.. పిక్స్ వైరల్
X

దిశ, వెబ్‌‌డెస్క్ : ఇటీవల కాలంలో భారత మహిళా క్రికెట్ జట్టు భారీ విజయాలను అందుకుంటోంది. మహిళా క్రికెటర్లు తమ ఆటతో ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు. అదే క్రమంలో జట్టులోని కొందరు బ్యాట్స్ ఉమెన్స్ అందంతో కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే టీమిండియా ఉమెన్స్ క్రికెటర్ స్మృతి మంధాన కోట్లాది మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఆమెకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది.

తాజాగా మరో మహిళా క్రికెటర్ సైతం బ్యాటర్, బౌలర్‌గా తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతూనే.. అందంతోనూ అలరిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా.. బ్యూటిఫుల్ హర్లీన్ కౌర్ డియోల్. ఆమె పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా చంఢీఘర్‌లో జన్మించిన హర్లీన్ కౌర్(23).. హిమాచల్ ప్రదేశ్ తరఫున దేశవాళీ టోర్నీలో ఆడింది. 2019లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో వన్డే, టీ20 జట్టులోకి అరగ్రేటం చేసింది. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుకు విజయాలను అందిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed