- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇక ఆర్టీఏల్లో నిరంతర హరితహారం
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ రాష్ట్రాన్ని హరితవనంగా మార్చే హరితహారం కార్యక్రమాన్ని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో నిరంతరం కొనసాగించనున్నట్లు రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు చెప్పారు. హరితహారంలో భాగంగా హైదరాబాద్‌లోని డా.బి.ఆర్.అంబేద్కర్ ట్రాన్స్‌పోర్ట్ భవన్‌లో గురువారం ఆయన పలు రకాల మొక్కలు నాటారు. సిబ్బందితో హరితహారం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సమాజహితం కాంక్షించి ప్రతి ఒక్కరూ వారి ఆవరణలో మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచగలుగుతామన్నారు. హరితహారాన్ని నిరంతరం కొనసాగిస్తుండటం ద్వారా ప్రకృతి సంపదను భావి తరాలకు అందించవచ్చన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ఆర్టీఏ కార్యాలయాల ఆవరణలోని ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఆకుపచ్చగా ఉండాలనే ముందు చూపుతో ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని మహోద్యమంగా చేపట్టిందని, పర్యావరణ పరిరక్షణలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు రమేశ్, మమతా ప్రసాద్, పాండురంగ నాయక్ పాల్గొన్నారు.