- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పుడలా.. ఇప్పుడిలా.. ఈటలపై హరీష్ ఫైర్
దిశ, వీణవంక: మండలంలోని మామిడాల పల్లి, ఇప్పలపల్లి, ఎలుబాక గ్రామాలలో ప్రచారంలో భాగంగా ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం రాకముందు కరెంటు లేక ప్రజలు, రైతులు ఇబ్బంది పడ్డారని వ్యాఖ్యానించారు. రాత్రి 12 గంటలకు బావుల దగ్గరికి వెళ్లేవారని, కరెంట్ షాక్ తగిలి అనేకమంది రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ 24 గంటలు కరెంట్ అందిస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేసి రైతుల గోస తీర్చారన్నారు. రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్నారని పేర్కొన్నాడు.
ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనం అంటుందని, కానీ తెలంగాణ ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసీఆర్ వడ్లు కొని రైతులను కాపాడుతానని అంటున్నారని హరీష్ తెలిపారు. ఈటల రాజేందర్ ఆరు నెలల క్రితం బీజేపీ దొంగల పార్టీ అని, రైతు వ్యతిరేక పార్టీ అని కొత్త వ్యవసాయ చట్టం అమలైతే అది రైతులకు ఉరి తాడు అవుతుందని అన్నారని, కానీ ఇప్పుడు అదే బీజేపీలో చేరి అన్నం పెట్టిన చేతికి సున్నం పూశారని విమర్శించారు. ఈటల రాజేందర్ ను ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా చేసింది గులాబీ జెండా, కేసీఆర్ అని గుర్తు చేశారు.