- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవీకేకు హరీష్ రావు షాక్.. 108 అంబులెన్స్‌ల నుంచి ఔట్!
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ అంబులెన్స్‌ల మీద ఇక నుంచి జీవీకే సంస్థ పేరు కనుమరుగు కానుంది. 108 సర్వీసులో కొత్త సంస్థలను తీసుకువచ్చేందుకు సర్కార్ప్లాన్చేస్తోంది. ఈ మేరకు ఓపెన్టెండర్లను పిలిచేందుకు కసరత్తు చేస్తోంది. మంత్రి హరీష్‌రావు డైరెక్షన్‌లో త్వరలో విధి విధానాలు ఖరారు కానున్నాయి. వాహనాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తుందంటూ ఉద్యోగులు, పేషెంట్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నందున ఆ సంస్థను తప్పించాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. కొత్త టెండర్లను పిలిచేందుకు వైద్యాధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.
నాలుగేళ్ల క్రితమే ముగిసింది..
రాష్ట్రంలో అంబులెన్స్‌లను నిర్వహించేందుకు కాంట్రాక్ట్తీసుకున్న జీవీకే సంస్థ గడువు గత నాలుగేళ్ల క్రితమే ముగిసింది. కానీ కొత్త టెండర్లు పిలవకుండా ఇన్నాళ్లు ప్రభుత్వం ఆ సంస్థకే రెన్యువల్చేస్తూ వచ్చింది. అయితే సౌకర్యాలు, సేవల్లో నిత్యం సమస్యలు వస్తుండటంతో ఇప్పుడు కొత్త టెండర్లను పిలవడానికి రెడీ అవుతున్నది. ఇదిలా ఉండగా జీవీకే నిర్వహణలో ప్రధానంగా వాహనాలు సక్రమంగా నిర్వహించలేకపోవడం, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకపోవడం వంటివి జరుగుతున్నాయి. పేషెంట్లను తరలించే సమయంలో పాత వాహనాలు కావడంతో ఎక్కడికక్కడే బండ్లు రోడ్లపై ఆగిపోతున్నాయి. అంతేగాక వాటికి మరమ్మతులు చేయించడం లేదు. దీంతో అంబులెన్స్‌ల కొరత ఏర్పడుతున్నది. తద్వారా సకాలంలో పేషెంట్లను తరలించలేకపోతున్నారు.
మరోవైపు కాల్‌సెంటర్ ఉద్యోగులు కూడా సరైన సమయంలో ఫోన్లు లిఫ్ట్చేయడం లేదని ఫిర్యాదులూ వస్తున్నాయి. అంతేగాక డ్రైవర్లు, టెక్నీషియన్లుకు రెండు మూడు నెలలకోసారి జీతాలు చెల్లిస్తున్నారు. దీంతో చాలా మంది డ్రైవర్లు డ్యూటీలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. పైగా సర్కార్బిల్లులు చెల్లించడం లేదంటూ జీవీకే పలుసార్లు బహిరంగంగానే చెప్పుకొచ్చింది. దీంతో ఆ సంస్థ సమర్ధవంతంగా పనిచేయడం లేదని 108 నిర్వహణను కొత్త సంస్థలకు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది.