ఆ ఘటనపై హరీశ్ రావు ఆగ్రహం

by Shyam |   ( Updated:2021-02-26 10:30:50.0  )
ఆ ఘటనపై హరీశ్ రావు ఆగ్రహం
X

దిశ,వెబ్‌డెస్క్: సిద్దిపేట బైపాస్ రోడ్డులో జరిగిన గోవధ ఘటనపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవధ చేసిన నిందితులను త్వరగా గుర్తించాలని పోలీసులను మంత్రి ఆదేశించారు. గోవధ హేయమైన చర్య అని ఆయన అన్నారు. గోవధకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. గోవులను తరలించిన వాహనాలను సీజ్ చేయాలని చెప్పారు.

సిద్దిపేట పట్టణ పరిధిలో గల నాగదేవత గుడి సమీపంలో ఒక పౌల్ట్రీ ఫామ్‌‌లో 18ఆవులను ఊచకోత కోసి వ్యాపారం చేస్తున్నారు గుర్తు తెలియని దుండగులు. విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, బీజేపి , హిందూ సంఘాలు చుట్టూ ప్రక్కల ప్రాంతాల వారు ఘటన స్థలానికి చేరి గో వధను అడ్డుకునీ ఆందోళన చేపట్టారు. దీంతో వారిని పోలీసులు చెదరగొట్టారు. ఆ తర్వాత నిరసనగా బైక్ ర్యాలీ చేపట్టగా పోలీసులకు హిందూ సంఘాలకు మధ్య స్వల్పంగా తోపులాట జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story