రంగనాయక సాగర్‌తో రైతుల కల సాకారం: మంత్రి హరీశ్‌రావు

by Shyam |   ( Updated:2020-04-16 09:37:45.0  )
రంగనాయక సాగర్‌తో రైతుల కల సాకారం: మంత్రి హరీశ్‌రావు
X

దిశ, మెదక్: రైతుల కల అతి త్వరలో రంగనాయకసాగర్‌తో సాకారం కానుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట శివారులో నిర్మించిన రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులను గురువారం మధ్యాహ్నం ఆయన పరిశీలించారు. మరో రెండు, మూడు రోజుల్లో వెట్‌ రన్‌కు సిద్ధం అవుతుండటంతో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. టన్నెల్‌లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఇరిగేషన్ శాఖ అధికారులు, మేఘా ఇంజినీరింగ్ సిబ్బందితో ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, సిద్ధిపేట, చిన్నకోడూర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు పాల సాయిరాం, శ్రీనివాస్, ఇరిగేషన్ ఈఈ ఆనంద్, ఇరిగేషన్ శాఖ అధికారిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సీఎం సహాయ నిధికి విరాళాలు

జిల్లా కేంద్రానికి చెందిన పలువురు మంత్రి హరీశ్‌రావు నివాసంలో సీఎంఆర్ఎఫ్‌కు విరాళాలు అదించారు. నారాయణరావుపేట మండలంలోని లక్ష్మీదేవి పల్లి గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి రోహిణి ఫర్టిలైజర్స్ రూ.20వేలు, సిద్దిపేట రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూ. 2లక్షలు, సిద్దిపేట పట్టణ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రూ.1.16 లక్షలు, సుడా వైస్ చైర్మన్ కేవీ రమణాచారి రూ. 50వేలు, సంఘ మిత్ర డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో రూ. 20 వేలు, సిద్దిపేట వికాస్ హైస్కూల్ రూ. 50 వేలు, ప్రముఖ వైద్యుడు భాస్కరరావు రూ. 50 వేలు, పారిశ్రామికవేత్త భాస్కర్ రెడ్డి రూ. లక్ష చొప్పున విరాళాలు అందించారు.

Tags: Minister Harisharo,review,Ranganayaka sagar

Advertisement

Next Story