- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పారిశుద్ధ్య కార్మికులకు మే డే అంకితం: హరీశ్‌రావు
దిశ, మెదక్: కరోనా కష్ట కాలంలో ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తోన్న పారిశుద్ధ్య కార్మికులకు ఈ కార్మిక దినోత్సవం అంకితమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో నిర్వహించిన ప్రపంచ కార్మికుల దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు కార్మికులను సన్మానించారు. కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. పట్టణంలోని శేషాద్రి ఆస్పత్రి సహకారంతో పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికీ ఫ్లాస్కులు, ఎన్ఆర్ఐల సహకారంతో నిత్యావసర సరుకులను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్మికులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన ఎన్నారైలను హరీశ్ రావు అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులతోనే అభివృద్ధి సాధ్యమని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కో కార్మికుడికి రూ. 5 వేల అదనపు వేతనం అందిస్తున్నామని తెలిపారు.
tag: harish rao, may day celebrations, siddipet