వెంకటేశం మృతి పట్ల హరీష్‎రావు సంతాపం

by Shyam |
వెంకటేశం మృతి పట్ల హరీష్‎రావు సంతాపం
X

దిశ, సిద్దిపేట: కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మెర వెంకటేశం అకాల మరణం పట్ల మంత్రి హరీష్ రావు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‎రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ అత్యంత సన్నిహితుడు, నాకు మంచి ఆత్మీయంగా ఉండే వెంకటేశం మరణం బాధాకరమన్నారు. కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ చైర్మన్‎గా రెండుసార్లు ఎన్నికై.. ఆలయంలో ఆయన చేసిన సేవలను హరీష్‎రావు కొనియాడారు. వెంకటేశం మృతి పట్ల వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

Advertisement

Next Story