- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండి సంజయ్ కామెంట్స్‌పై హరీశ్‌రావు కౌంటర్
దిశ సిద్దిపేట: బీజేపీ నాయకుల కళ్ళి, బొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని, జూటా గాళ్లతో జాగ్రత్తగా ఉండాలని మంత్రి హరీశ్ రావు సిద్దిపేట ప్రజలకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం పలు వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకుముందు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లింగరెడ్డిపల్లిలో టీఆర్‌ఎస్ పార్టీ జెండాను మంత్రి హరీశ్ రావు ఎగురవేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటలకు మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. కేంద్రం రూ. 135 కోట్లు ఇచ్చామని అంటున్నారు.. 135 రూపాయలు కూడా ఇచ్చిన దాఖలు లేవన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంద రూపాయల ఆయిల్ రెండు వందలు, ఐదు వందల గ్యాస్ వెయ్యి రూపాయలు చేసిందని మండిపడ్డారు. కరోనా సమయంలో ఏ నాయకుడు కనబడలేదు కానీ ఇప్పుడు ఓట్ల సమయంలో ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని నిలదీశారు.