- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆడబిడ్డ అవస్థ పడొద్దనే మిషన్ భగీరథ: హరీశ్
by Shyam |
X
దిశ, మెదక్: ప్రతి ఆడబిడ్డ నీటి కోసం గడప దాటొద్దన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ప్రారంభించారని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలోని కోమటిచెరువు సమీపంలో రూ. 1.50 కోట్లతో మిషన్ భగీరథ- ఆర్.డబ్య్లూ.ఎస్. ఎస్ఈ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రతి వ్యక్తికి 100 లీటర్ల స్వచ్ఛమైన తాగు నీరు ఇవ్వాలన్నదే మిషన్ భగీరథ లక్ష్యమని చెప్పారు. సీఎం కేసీఆర్ తాగునీరు కోసం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. లీకేజీలు అనే పరిస్థితి సిద్దిపేట జిల్లాలో లేకుండా చూడాలని ఇంజినీర్లను ఆదేశించారు. అంతేకాకుండా, యువ ఆర్ డబ్ల్యూ ఎస్ ఇంజనీర్లు, సైట్ ఇన్ స్పెక్టర్లకు మెమెంటో పత్రాలను మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా అందించారు.
Advertisement
Next Story