- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ముగిసిన హరిద్వార్ కుంభమేళా.. ప్రధాని పిలుపుతో..!
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రరూపం దాలుస్తున్నాయి. రోజువారీగా రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతుండటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఇటు ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురవువున్నారు. ఇప్పటికే కరోనా వ్యాప్తికి కారణమయ్యే మ్యూజియంలు, చారిత్రక ప్రదేశాలను కేంద్రం మూసి వేయించింది. దాంతో పాటు పలు పుణ్యక్షేత్రాల్లో దర్శనాలు, భక్తుల రద్దీపై రాష్ట్రాలకు నిబంధనలు విధించింది. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో ఈనెల కుంభమేళా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, కరోనా ఒక్కసారిగా విజృంభించడంతో కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే అక్కడ 1,700పైగా కేసులు నమోదయ్యాయి.
30మందికి పైగా సాధువులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ కుంభమేళా ఇలానే కొనసాగితే కరోనా వ్యాప్తి అడ్డుకోవడం కష్టతరమని అక్కడి జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. ఎందుకంటే కుంభమేళాకు లక్షల సంఖ్యలో సాధువులు మాస్కులు లేకుండా వచ్చి సామూహిక స్నానాలు ఆచరిస్తున్నారు. విషయం తెలిసి కేంద్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్రమోడీ కుంభమేళాను త్వరగా ముగించాలని పిలుపునివ్వడంతో జునా అఖాడాకు చెందిన సాధు సంతులు శనివారంతో ఈ మేళాను ముగిస్తున్నట్లు ప్రకటించారు. ఇకనుంచి సాధువుల ఎవరూ కుంభమేళాకు రాకూడదని ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో లక్షల మంది భక్తులు, సాధువులు కరోనా బారిన పడకుండా ఉండవచ్చని అధికారులు తెలిపారు.