క్రికెట్‌కు గుడ్ బై.. రాజకీయాల్లోకి హర్భజన్ సింగ్.!

by Anukaran |
క్రికెట్‌కు గుడ్ బై.. రాజకీయాల్లోకి హర్భజన్ సింగ్.!
X

దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. టీమిండియా తరఫున 23 ఏళ్ల తన అంతర్జాతీయ కెరీర్‌లో 711 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించి దిగ్గజ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే భజ్జీ రిటైర్మెంట్ తర్వాత అతడి సెకండ్ ఇన్నింగ్స్ గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

భజ్జీ.. ఐపీఎల్‌లో సహాయ సిబ్బంది రోల్ పోషిస్తాడని, పాలిటిక్స్‌లోకి రాబోతున్నాడని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కామెంట్లపై భజ్జీ స్పందించాడు. పంజాబ్ రాష్ట్రానికి నా వంతు సేవ చేస్తానని అన్నాడు. ప్రతి పార్టీలోని నాయకులు నాకు తెలుసు.. ఏదైనా పార్టీలో చేరే ముందే నేను అందరికీ చెబుతానని కామెంట్స్ చేశాడు. అది రాజకీయాల ద్వారానా, లేక మరే మార్గం ద్వారానా అనేది ఇంకా నిశ్చయించుకోలేదని, దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని సస్పెన్స్ క్రియేట్ చేశాడు.

Advertisement

Next Story

Most Viewed