- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాలీవుడ్ సింగర్ ను వేధిస్తున్న డైరెక్టర్.. ఆ వీడియోలను పోస్ట్ చేస్తూ
దిశ, వెబ్‌డెస్క్: చిత్రపరిశ్రమలో వేధింపులు ఎక్కువైపోతున్నాయి. సోషల్ మీడియాలో కామెంట్లతో కొంతమంది వేధిస్తుంటే.. ఇంకొంతమంది వారి పేరును వాడుకొని వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ పేరును వాడుకొని వేధింపులకు గురిచేస్తున్న ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలలోకి వెళితే.. హైదరాబాద్ కి చెందిన మెడికాయల నవీన్‌కుమార్ (34) షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా ప్రముఖులతో ఇంటర్వ్యూ లు నిర్వహిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే గత నెల టాలీవుడ్ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ తో ఒక ఇంటర్వ్యూ చేశాడు.
అనంతరం ఆ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా ఆమె ఫోటోను లోగో గా వాడుతూ కొత్త యూట్యూబ్ చానల్ ని క్రియేట్ చేసి, ఆమె చేసినట్లు నమ్మించాడు. అందులో ఆమెకు సంబంధించిన పర్సనల్ ఫోటోలను, వెబ్ సిరీస్ వీడియోలు, ఆల్బమ్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ వీడియోలు అప్‌లోడ్ చేశాడు. అవి కాస్తా వైరల్ అయ్యి సింగర్ దృష్టికి వెళ్లాయి. దీంతో సింగర్, నవీన్ పై ఫైర్ అయ్యింది. తన అనుమతి లేకుండా తన ఫోటో తో చానల్ ఎందుకు పెట్టారని, తక్షణమే ఆ చానల్ ని తీసివేసి, తన ఫోటోలను డిలీట్ చేయాలనీ కోరింది. అయినా నవీన్ ఆమె మాట వినకపోగా ఇంకా ఎక్కువగా వీడియోలు పెడుతూ ఆమెను వేధించసాగాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని శుక్రవారం నవీన్‌కుమార్ ను అరెస్టు చేశారు.
Read More: ప్రియుడి ఎదుటే స్నేహితుల గ్యాంగ్ రేప్.. ప్రియురాలి పెళ్లి గిఫ్ట్ గా వీడియోని వైరల్ చేసి..