హరప్పా నాగరికుల ఇంట్రెస్టింగ్ ఫుడ్ హ్యాబిట్స్!

by Shyam |
Harappan people
X

దిశ, ఫీచర్స్ : 4 వేల ఏళ్ల కిందట హరప్పా నాగరికతలో ప్రజల ప్రధాన ఆదాయ వనరు ఏది? వారి ఆహారపు అలవాట్లు, సంస్కృతీ సంప్రదాయాలతో పాటు ఆ కాలంలో మహిళల పరిస్థితి ఎలా ఉండేది? అనే విషయాలపై భారత పురవాస్తు శాఖ (ఏఎస్ఐ) రీసెర్చ్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ‘పురావస్తు శాఖ, బీర్బల్ సహాని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్’ తమ అధ్యయనం ద్వారా హరప్పా నాగరికత గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను కనుగొన్నారు. ఆ వివరాలు ‘ఆర్కియాలజికల్ సైన్స్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

2014లో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరిపిన తవ్వకాల్లో పశ్చిమ రాజస్థాన్‌ ప్రాంతంలో హరప్పా నాగరికతకు సంబంధించిన శిలాజాలు, అవశేషాలు బయటపడ్డాయి. ఈ మేరకు పురావస్తు శాస్త్రవేత్తలు బింజోర్‌ అనే ప్రాంతంలో లడ్డూ ఆకృతి గల గోధుమ రంగు వస్తువులు ఏడింటిని(7) గుర్తించారు. వీటితో పాటు రెండు కొమ్ముల ఎద్దు విగ్రహాలు, బాడిసె మాదిరి ఉండే వస్తువును స్వాధీనం చేసుకున్నారు. అనుప్ఘర్ జిల్లాలోని ఈ ప్రదేశాన్ని స్వాధీన పరుచుకున్న ఏఎస్ఐ.. ఇప్పటికీ తవ్వకాలు కొనసాగిస్తోంది. సుమారు 2600 బీసీ కాలం నాటి ఈ లడ్డూలు చెక్కు చెదరకుండా ఉండటం ఆశ్చర్యకరంగా ఉందని బీర్బల్ సహాని ఇన్‌స్టిట్యూట్ సీనియర్ సైంటిస్ట్ రాజేశ్ అగ్నిహోత్రి తెలిపారు. కాగా వీటిల్లో ఆర్గానిక్ మ్యాటర్ ఏంటి? తదితర విషయాలు తెలుసుకున్న శాస్త్రవేత్తలు.. ఇవి మానవులు తయారు చేసినవనేనని కన్ఫర్మ్ చేశారు.

మొదట ఈ లడ్డూ ఆకృతులు నాన్ -వెజిటేరియన్ ఫుడ్‌గా భావించామని, కానీ అది తప్పని తేలిందని బీర్బల్ సహాని ఇన్‌స్టిట్యూట్ సైంటిస్ట్ అంజుమ్ ఫరూకి పేర్కొన్నారు. బార్లీ, గోధుమ ఇతర నూనెగింజలతో హై ప్రొటీన్స్ ఉండేలా ఈ లడ్డూలు తయారు చేసినట్లు తెలుస్తోందని, ఈ హరప్పా నాగరికులు సింధూ లోయ ప్రాంతంలో వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారన్నారు. వీరు తయారు చేసిన ఫుడ్ ఐటమ్స్‌లో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం అధికంగా ఉండటం చూస్తుంటే తృణధాన్యాలు పండించేవారని వెల్లడించారు. కాగా బింజోర్‌లో దొరికిన పురావస్తు అవశేషాలు, లడ్డూలపై సైంటిఫిక్ స్టడీ చేసిన తొమ్మిదిమంది పురావస్తు శాస్త్రవేత్తలు.. హరప్పా నాగరికులు లడ్డూలు తినేవారని, దేవతారాధనతో పాటు కర్మలు పాటించేవారని నిర్ధారించారు.

డిస్కవరీ ఆఫ్ ది సెంచరీ.. ‘సనౌలి యోధులు’

Advertisement

Next Story

Most Viewed