సెంచరీతో ఆకట్టుకున్న హనుమ విహారి

by Shyam |
సెంచరీతో ఆకట్టుకున్న హనుమ విహారి
X

హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు హనుమ విహారి సెంచరీతో ఆకట్టుకున్నాడు. 182 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. విహారికి చక్కటి సహకారాన్నిపుజారా(93) అందించాడు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 193 పరుగులు జోడించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు పృథ్వీ షా(0), మయాంక్ అగర్వాల్(1) తీవ్ర నిరాశ పర్చారు. వన్ డౌన్‌లో వచ్చిన శుభమన్ గిల్ డక్ అవుట్ అయ్యాడు. అనంతరం వచ్చిన రహానే కూడా 18 పరుగులకే వెనుదిరిగాడు. ఇక కివీస్ బౌలర్లు కుగ్లీజిన్‌, ఇష్‌ సోథీలు తలో మూడు వికెట్లు సాధించగా, గిబ్సన్‌ రెండు వికెట్లు తీయగా, నీషమ్‌కు వికెట్‌ దక్కింది.

Advertisement

Next Story