హను రాఘవపూడికి దుల్కర్ గ్రీన్ సిగ్నల్

by Shyam |
హను రాఘవపూడికి దుల్కర్ గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్‌డెస్క్: దుల్కర్ సల్మాన్.. శాండల్ వుడ్ సూపర్ స్టార్. బాలీవుడ్‌లోనూ సత్తా చాటిన దుల్కర్.. ‘మహానటి’ సినిమాలో జెమిని గణేశన్‌గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అంతకు ముందు తెలుగులో డబ్ అయిన ‘ఓకే బంగారం’ మూవీతోనే ఫ్యాన్స్‌ సంపాదించుకున్న దుల్కర్.. ఇప్పుడు హీరోగా స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్ చేస్తున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. ఎప్పటి నుంచో తెలుగు సినిమా చేయాలన్న కోరికను ఈ చిత్రం ద్వారా తీర్చుకోబోతున్నాడు దుల్కర్. ఈ మధ్యే హీరోను కలిసిన డైరెక్టర్.. కథను వినిపించారని సమాచారం. ఇద్దరి మధ్య చర్చలు పూర్తవడంతో పాటు.. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ చేసే అవకాశం ఉందట. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమా విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా దుల్కర్ ఈ మధ్యే బృంద మాస్టర్ దర్శకత్వంలో ‘హేయ్ సినామిక’ చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించాడు. మరో వైపు హను రాఘవపూడి పూజా హెగ్డేతో లేడీ ఓరియంటెడ్ సినిమాను ప్లాన్ చేశాడని టాక్.

tags : Dulquer Salman, Hanu Raghavapudi, Movie, Tollywood

Next Story