ఆమెను ఒంటరిగా వదిలేయండి.. శిల్పకు నిర్మాత సపోర్ట్

by Shyam |   ( Updated:2021-07-31 04:56:21.0  )
ఆమెను ఒంటరిగా వదిలేయండి.. శిల్పకు నిర్మాత సపోర్ట్
X

దిశ, సినిమా : పోర్న్ ఫిలిమ్స్ నిర్మించి, పంపిణీ చేసినందుకు గాను నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది శిల్ప. కాగా ఈ పరిణామాలపై అసహనం వ్యక్తం చేసిన ఫిల్మ్ మేకర్ హన్సల్ మెహతా.. ఆమె గౌరవం, ప్రైవసీకి భంగం కలిగించవద్దని సూచించారు. ఈ మేరకు చేసిన ట్వీట్‌లో శిల్పాశెట్టికి మద్దతు తెలపకున్నా పర్వాలేదు గానీ, ఇబ్బంది పెట్టకుండా ఉంటేనే మంచిదని సలహా ఇచ్చాడు. తనను ఒంటరిగా వదిలేయాలని, నిజం ఏంటో చట్టమే తేలుస్తుందని అభిప్రాయపడ్డాడు. విచారణ జరగకముందే దోషులుగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఈ ఇష్యూపై మౌనం వహిస్తున్న పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల తీరును సైతం విమర్శించారు. అంతా బాగున్నప్పుడు కలిసి పార్టీలు చేసుకునేవారు.. క్లిష్ట సమయాల్లో సైలెంట్‌గా ఉంటూ ఒంటరిని చేయడం బాలేదన్నారు. మొత్తానికి నిజమేదైనా ఇప్పటికే కావల్సినంత నష్టం జరిగిందన్నారు.

Advertisement

Next Story