- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చరిత్రలో ఎక్కడా అధికార పార్టీ ధర్నాలు చేసిన దాఖలాలు లేవు.. కె. హన్మంతు ముదిరాజ్
దిశ, పరిగి: రైతుల పక్షాన ఉన్నామని చెప్పుకునే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ధర్నాలు చేస్తూ తమ చేతకానితన్నాన్ని వారే బయట పెట్టుకుంటున్నారంటూ డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.హన్మంతు ముదిరాజ్ అన్నారు. చరిత్రలో ఎక్కడా అధికార పార్టీ ధర్నాలు చేసిన దాఖలాలు లేవన్నారు. దొంగే.. దొంగ దొంగ అన్నట్లు టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు ఉందన్నారు. ఇన్నేళ్ళుగా వరి కొనుగోలు విషయంలో రైతులు ఎప్పుడూ ఇబ్బంది పడలేదని టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. గడిచిన ఏడు సంవత్సరాలలో దాదాపు 7 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. అభం శుభం తెలియని ఇంటర్ విద్యార్థులు పిట్టల్లా రాలిపోతూ ఉంటే అవి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కనిపించడం లేదా అని తప్పుపట్టారు.
ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న వెంటనే వరి కొనుగోళ్లు చేపట్టాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతూ.. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సాగు చట్టాలను ఎప్పుడు వ్యతిరేకించని టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. సాగు చట్టాలను రద్దు చేసిన తర్వాత నేనే రద్దు చేయి చేయించానని కేసీఆర్ గొప్పులు చెప్పుకున్నారన్నారు. ఇప్పుడు కూడా కేవలం కేంద్రం పైన నెట్టే ప్రయత్నం చేసి చేతులు దులుపుకోవాలని అనుకుంటున్నారన్నారు. ఇలాంటి మోసపూరిత మాటలు మానుకొని యాసంగిలో వరి ధాన్యానికి అనుమతించి వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.