నాకు ఆ రాష్ట్రమంటే అందుకే పక్షపాతం -జీవీఎల్ 

by Anukaran |
నాకు ఆ రాష్ట్రమంటే అందుకే పక్షపాతం -జీవీఎల్ 
X

దిశ, ఏపీ బ్యూరో: వచ్చే ఆరు నెలల్లో రూ. 7 కోట్లు వెచ్చించి పది వేల రైతు సంఘాలను ఏర్పాటు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ జీవీఎల్నరసింహారావు తెలిపారు. కేంద్రం ఇటీవల స్పైసెస్ బోర్డు ద్వారా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కు చైర్మన్గా జీవీఎల్ నియమితులయ్యారు. గురువారం తొలి సమావేశం గుంటూరు మిర్చి యార్డులో జరిగింది.

ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ… మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక టాస్క్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆరు నెలల కార్యచరణలో భాగంగా తొలి సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. రైతులు తమ సమస్యలను కమిటీ ముందు ప్రస్తావించవచ్చన్నారు. తాను గుంటూరు జిల్లా వాసిని కాబట్టి కేంద్రం కొత్తగా తీసుకున్న నిర్ణయాలను ఏపీలో ముందుగా అమలు చేయాలన్నది తన పక్షపాతమని చెప్పారు.

500 మంది రైతులు సంఘంగా ఏర్పడితే కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు రైతుల ఖాతాలోకి జమ అవుతాయన్నారు. ముందుగా రూ.25 లక్షలు, ఈక్విటీ రూపంలో మరో రూ.15 లక్షలను కేంద్రం ఆర్థిక సాయం రూపంలో అందజేస్తుందని తెలిపారు. గుంటూరు జిల్లాలో కనీసం 400 నుంచి 500 రైతు కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

రూ.లక్ష కోట్ల పెట్టుబడితో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అందులో ఏపీకి రూ.6,500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకి కలిపి రూ.10వేల కోట్లపైగా కేంద్రం నిధులు కేటాయించిందని జీవీఎల్ వివరించారు.

Advertisement

Next Story