ఆ పార్టీల ఎంపీలు గూండాల్లా ప్రవర్తించారు : GVL

by Anukaran |
ఆ పార్టీల ఎంపీలు గూండాల్లా ప్రవర్తించారు : GVL
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులతో రైతులకు మేలు జరుగుతుందని ఏపీ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరహింహరావు అన్నారు. రైతులు తమ పంటలను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని.. అందుకు ఇవి వెసలుబాటును కల్పిస్తాయని వివరించారు.అయితే, వ్యవసాయ బిల్లులపై చర్చ సమయంలో ప్రతిపక్షాలు దారుణంగా వ్యవహరించాయని ఆయన విమర్శించారు.

ముఖ్యంగా కాంగ్రెస్, కమ్యూనిస్టు ఎంపీలు రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందే సమయంలో గూండాల్లా ప్రవర్తించారని జీవీఎల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరైతే సభలో దురుసుగా ప్రవర్తించారో వారిపై చర్యలు తీసుకోవాలని చైర్మన్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన స్పష్టంచేశారు.

Advertisement

Next Story