GV ప్రకాష్, సైంధవిలకు ఆడబిడ్డ.. రాకుమారి వచ్చిందని ట్వీట్

by Shyam |
GV ప్రకాష్, సైంధవిలకు ఆడబిడ్డ.. రాకుమారి వచ్చిందని ట్వీట్
X

GV ప్రకాష్ కుమార్ … టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ యాక్టర్. 2013లో చిన్ననాటి స్నేహితురాలు అయిన సింగర్ సైంధవిని పెళ్లి చేసుకున్నాడు. కాగా ఈ బెస్ట్ కపుల్ కి ఆడబిడ్డ జన్మించింది. ఏప్రిల్ 19న మా లైఫ్ లోకి ఏంజెల్ వచ్చిందని… రాజకుమారి జన్మించిందని సోషల్ మీడియా వేదికగా ఈ హ్యాపీ న్యూస్ ను అభిమానులతో పంచుకున్నాడు GV ప్రకాష్.
దీంతో అటు సినీ ప్రముఖులు ఇటు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సంగీత దర్శకుడి నుంచి నటుడిగా మారిన GV …. ప్రస్తుతం తమిళ్ లో ఆరు సినిమాలు చేస్తున్నాడట. సూర్య హీరోగా వస్తున్న ఆకాశమే నీ హద్దు రా, కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తున్న తలైవి సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నారు GV.

Tags: GV Prakash Kumar, Saindhavi, Kollywood, Music Director

Advertisement

Next Story