జీవీ హాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ రిలీజ్

by Anukaran |   ( Updated:2023-03-24 19:04:33.0  )
జీవీ హాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ రిలీజ్
X

జీవీ ప్రకాష్ కెరియర్‌ను భలే బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఓ వైపు మ్యూజిక్ డైరెక్టర్‌గా బిజీగా ఉంటూనే.. 2015లో డార్లింగ్ సినిమాతో యాక్టర్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇక తన యాక్టింగ్‌ను మెచ్చిన దర్శక, నిర్మాతలు తనతో వరుస సినిమాలు చేసేందుకు ముందుకు రావడంతో ప్రస్తుతం హీరోగా కూడా బిజీ అయిపోయాడు. అలాగని మ్యూజిక్ మధ్యలో వదిలేయకుండా.. అటు సంగీతం అందిస్తూనే ఇటు కథానాయకుడిగా రాణిస్తున్నాడు. కోలీవుడ్‌లో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న జీవీ ప్రకాష్‌.. ఇప్పుడు హాలీవుడ్‌లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.

హాలీవుడ్ మూవీ ‘ట్రాప్ సిటీ’లో కీలక పాత్ర చేస్తున్నాడు జీవీ. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల కాగా.. బెస్ట్ పర్ఫార్మెన్స్‌తో శభాష్ అనిపించుకున్నాడు. సమాజంలో రాపర్‌గా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నించే ఓ సింగర్.. మాఫియాతో ఉన్న సంబంధాల కారణంగా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చిందనేది ట్రాప్ సిటీ కథ కాగా.. ఇందులో జీవీ సర్జన్‌గా కనిపించబోతున్నాడు. అమెరికన్ స్టాండప్ కమెడియన్ టీ. జాక్సన్ రాపర్‌గా నటిస్తున్న సినిమాలో.. యాక్టర్ నెపోలియన్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తున్నారు. కాగా, రిక్కి బర్చెల్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనుంది మూవీ యూనిట్.

Advertisement

Next Story