హైదరాబాద్‌లో కత్తి పోట్ల కలకలం

by Sumithra |

దిశ, హైదరాబాద్: నగరంలో కత్తిపోట్ల కలకలం రేగింది. గురువారం చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మెట్టుగూడలో ఓ కిరాణం షాపు వద్ద నిల్చున్న రైల్వేఉద్యోగి రాకేశ్ ‌పై భాగ్యరాజ్‌ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. రాకేశ్‌ కడుపుపై మూడుసార్లు కత్తితో పొడవడంతో అక్కడే అతడు కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న నార్త్‌ జోన్ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న రాకేశ్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడికి నేరచరిత్ర ఉన్నట్లు తెలుస్తుండగా, ఇంక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story