నాడు హారతులు..నేడు రోదనలా!: గుత్తా

by Shyam |
నాడు హారతులు..నేడు రోదనలా!: గుత్తా
X

దిశ, నల్లగొండ: సీఎం కేసీఆర్ ఉండగా కృష్ణా నది నుంచి చుక్క నీటిని కూడా ఏపీ అక్రమంగా తరలించలేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సీఎం అయిన తరువాతనే కృష్ణానదిపై ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు నీటి విడుదల సమయంలో డీకే అరుణ హారతులు పట్టిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జీవో నంబర్ 203తో కృష్ణా ఆయకట్టు ఎడారి కానుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి ఆంధ్ర, రాయలసీమ నేతలే ముఖ్యమంత్రులు కావడంతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లిందని విమర్శించారు. పోతిరెడ్డిపాడును ప్రస్తుత నల్లగొండ, భువనగిరి ఎంపీలు అప్పట్లో సమర్థించారని గుర్తుచేశారు. కాంట్రాక్టుల కోసం పులిచింతల, పోతిరెడ్డిపాడును సమర్థించిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గుండెలపై చేతులు వేసుకుని ఆలోచించుకోవాలని గుత్తా హితవు పలికారు. ఏపీ విభజన చట్టానికి వ్యతిరేకంగా జగన్ వ్యహరిస్తున్నారని మండిపడ్డారు. జీవో నెంబర్ 203ను ఏపీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed