- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుంటూరు జిల్లాలో ఆ హైవేపై వెళ్లారో.. ఇక అంతే!
దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా నల్లపాడు హైవే రోడ్డుపై దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. గత కొన్ని రోజులుగా ఐదుగురు సభ్యుల ముఠా హల్ చల్ చేస్తోంది. హైవేపై వెళ్లే లారీలను, ఒంటరిగా బైక్‌పై వెళ్లేవారిని టార్గెట్ చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న గుంటూరు సౌత్ జోన్ డీఎస్పీ ప్రశాంతి ప్రత్యేక దృష్టి సారించారు. రెడ్‌హ్యాండెడ్‌గా ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఐదుగురు యువకులు బ్యాచ్‌గా ఏర్పడి ఈ దోపిడీలకు పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.
ప్రతి రోజు హైవేపై దోపిడీలు చేస్తున్నట్లు నిందితులు అంగీకరించారన్నారు. లారీ డ్రైవర్లను గాయపరచి వారి దగ్గర ఉన్న నగదు, సెల్ ఫోన్లు దోచుకుంటున్నారని తెలిపారు. 2017 నుంచి దోపిడీలు చేస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. ఈ బ్యాచ్‌లో అంతా19ఏళ్ల లోపువారేనని.. వీరిలో ఒక మైనర్ కూడా ఉన్నారని డీఎస్పీ ప్రశాంతి వెల్లడించారు.